పరిషత్‌ పోరు నేడే | - | Sakshi
Sakshi News home page

పరిషత్‌ పోరు నేడే

Nov 5 2026 12:10 AM | Updated on Nov 5 2026 12:10 AM

పెదపూడిలో ఎన్నికల సామాగ్రి పరిశీలించుకుంటున్న పోలింగ్‌ సిబ్బంది

కడియంలో ఎన్నికల సామగ్రిని పరిశీలిస్తున్న జాయింట్‌ కలెక్టర్‌ మేఘ స్వరూప్‌

సాక్షి, రాజమహేంద్రవరం: జిల్లాలోని 20 జెడ్పీటీసీ, 387 ఎంపీటీసీల స్థానాలకు గురువారం పోలింగ్‌ జరగనుంది. భారీ వర్షం కారణంగా గోపాలపురం మండలంలో ఒక జెడ్పీ, 18 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికను వాయిదా వేశారు. వీటిలో కలిపి జిల్లాలో మొత్తం 21 జెడ్పీటీసీల కోసం 73 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. వైఎస్సార్‌ సీపీ తరఫున అన్ని స్థానాల్లో అభ్యర్థులు బరిలో నిలిచారు. టీడీపీ నుంచి 13, జనసేన నుంచి 7, బీజేపీ నుంచి ఒకరు, ఇతర పార్టీల నుంచి, స్వతంత్రులుగా 31 మంది పోటీలో ఉన్నారు. జిల్లాలోని మొత్తం 412 ఎంపీటీసీ స్థానాలుండగా ఇప్పటికే 7 స్థానాలు ఏకగ్రీవమైన విషయం తెలిసిందే. మిగిలిన 405 స్థానాల కోసం 901 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వైఎస్సార్‌ సీపీ నుంచి 405 మంది, టీడీపీ నుంచి 266 మంది, జనసేన నుంచి 120 మంది, బీజేపీ నుంచి 21 మంది, ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులుగా 89 మంది బరిలో నిలిచారు.

మహిళలే గెలుపు నిర్ణేతలు

పరిషత్‌ పోరులో జిల్లా వ్యాప్తంగా 12,02,548 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 5,89,373 మంది పురుషులు, 6,13,141 మంది మహిళలు, 34 మంది ఇతర ఓటర్లున్నారు. అయితే పురుషుల కంటే మహిళల ఓట్లే 23,768 వరకూ ఎక్కువ ఉన్నాయి. దీంతో మహిళలను ప్రసన్నం చేసుకునేందుకు, వారి ఓట్లు సొంతం చేసు కునేందుకు పోటీలోని అభ్యర్థులు విస్తృతంగా ప్రచా రం చేశారు. అయితే సంక్షేమ పథకాలు అమలులో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా విఫలమవడంతో మహిళలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. వారంతా కూటమి అభ్యర్థులకు ఓటుతో బుద్ధి చెబుతారనే ప్రచారం ఉంది. అర్నబ్‌ తుపాను ఇలా వెళ్లిందో లేదో మురసు విరుచుకుపడడంతో గత మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో మూడు మండలాల్లో ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాలను కూడా మార్పు చేశారు బిక్కవోలు మండల సిబ్బందికి సామర్లకోట–రాజమహేంద్రవరం కెనాల్‌ రోడ్డులోని శ్రీనివాసం గ్రాండ్‌లో సామగ్రి పంపిణీ చేశారు. కపిలేశ్వరపురం మండలానికి అంగర గ్రామంలోని శ్రీ సిద్ధార్థ జూనియర్‌ కళాశాలలో, రాయవరం మండలానికి మెయిన్‌ రోడ్డులోని ముళ్లపూడి బుజ్జిరాజు సూర్యనారాయణమ్మ ఫంక్షన్‌ హాల్‌లో సామగ్రి పంపిణీ చేశారు. కాగా.. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఓటర్లకు స్లిప్పులు అందకపోవడం చర్చనీయాంశంగా మారింది.

గోపాలపురం మండలంలో వాయిదా

గోపాలపురం మండల పరిధిలో బుధవారం ఆకస్మిక వరదలు సంభవించడంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కీర్తి చేకూరి బుధవారం రాత్రి ప్రకటించారు. ప్రకృతి వైపరీత్యం కారణంగా పోలింగ్‌ నిర్వహణకు ఏర్పడిన ఇబ్బందులను, ఓటర్లు, ఎన్నికల సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. గోపాలపురం జెడ్పీటీసీ స్థానంతో పాటు మండలంలోని 18 ఎంపీటీసీ స్థానాలకు నవంబర్‌ 5న జరగాల్సిన పోలింగ్‌ను 6కి వాయిదా వేశామన్నారు.

ఫ జిల్లాలో 20 జెడ్పీటీసీ, 387

ఎంపీటీసీల స్థానాలకు పోలింగ్‌

ఫ భారీ వర్షం కారణంగా

గోపాలపురంలో ఒక జెడ్పీ,

18 ఎంపీటీసీ స్థానాలకు వాయిదా

ఫ అక్కడ ఈ నెల 6న నిర్వహణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement