● వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు వేణు
● విస్తృతంగా ఎన్నికల ప్రచారం
రాజమహేంద్రవరం రూరల్: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థులకు ఓటు వేసి, చంద్రబాబు ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఓటర్లను అభ్యర్ధించారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం పాతకోలమూరు గ్రామంలో జెడ్పీటీసీ అభ్యర్థి మెల్లిమి గంగరాజు (గాబ్రియేలు), ఎంపీటీసీ 1 అభ్యర్థి ఉల్లింగి ప్రతిభలకు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వేణు మాట్లాడుతూ సూపర్‌సిక్స్ పథకాలతో అనేక హామీలు ఇచ్చి చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లు గడిచినా పూర్తిస్థాయిలో అమలు చేయలేదన్నారు.
కడియం: కూటమి ప్రభుత్వ హయాంలో నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య ప్రజలకు అందనంత ఎత్తుకు పెరిగి పోయాయని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజు (బాబు) అన్నారు. పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి శివాజీ, ఎంపీపీ అభ్యర్థి తాడాల రాజరాజేశ్వరి, ఎంపీటీసీలు పెంకే రామకృష్ణ, దాసరి చంద్రకళ, గుడాల వీరమణి, సాకా మరియమ్మకు మద్దతుగా కడియంలో ప్రచారం చేపట్టారు. బాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తోపుడు బండిపై నిత్యావసరాలను, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో ధరలు, చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత పెరిగిన ధరల బోర్డులను ప్రదర్శించారు. ప్రతి ఒక్కరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి, వైఎస్సార్ సీపీ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
కపిలేశ్వరపురం: అంగరలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు
రాజమహేంద్రవరం రూరల్: పాత కోలమూరులో ప్రచారం చేస్తున్న వేణు
వైఎస్సార్ సీపీలో చేరిన వారికి కండువాలు వేసి ఆహ్వానం పలుకుతున్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సూర్యనారాయణరెడ్డి
అనపర్తి: దుప్పలపూడి గ్రామానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కోట రాజు, పెనుముచ్చు రామకృష్ణ, వరిగిటి అశోక్, మండెల్లి తేజ, కట్టమేను సత్తియ్య, చంద్రమళ్ల ఏసేబు, చంద్రమళ్ల రాజుబాబు, చంద్రపాటి సురేష్, తులూరి సూర్య తేజ, ఉండ్రాజు సుధాకర్ తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలసి సోమవారం వైఎస్సార్ సీపీలో చేరారు. అనపర్తిలోని పార్టీ కార్యాలయంలో వారికి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ కో ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీలో చేరిన ప్రతి ఒక్కరూ అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరించి, స్థానిక సంస్థల ఎన్నికల్లో మన పార్టీ అభ్యర్థులు విజయానికి కృషి చేయాలన్నారు. ఈ చేరికలు కేవలం ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరింత మంది వైఎస్సార్ సీపీలో చేరతారన్నారు. కార్యక్రమంలో అనపర్తి మండల కన్వీనర్ సత్తి రామకృష్ణారెడ్డి (రాంబాబు), జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు వల్లభశెట్టి రామ సతీష్, వాడ్రేవు చంద్రశేఖర్, దొండపాటి మణికంఠ, మాజీ ఎంపీటీసీ కొండ సత్తిబాబు, చిలకమర్తి శ్రీను, వల్లభశెట్టి శ్రీను, చిచ్చారపు బాపిరాజు, వోగిరెడ్డి సుబ్బారెడ్డి, వల్లభశెట్టి శ్రీనివాసు, పోలిపర్తి వెంకటేష్, నందికోళ్ల శ్రీను, పేపకాయల దొర బాబు, కట్టమేను దుర్గయ్య, కోట ఏసు, జంపా సాయి, కోట బెంజిమెన్ పాల్గొన్నారు.


