రాజమహేంద్రవరంలోని పుష్కరఘాట్‌కు ఎంతో ఘన చరిత్ర ఉంది. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ రేవులో పుణ్యస్నానాలు ఆచరించడానికి ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎందో తరలివస్తారు. అయితే ఒకప్పుడు వైభవంగా వెలిగిన ఈ పవిత్ర ఘాట్ నేడు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ఘాట్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు, గాజు సీసాలు, పాత గుడ్డలు పేరుకుపోయాయి. పారిశుధ్య పనులు సక్రమంగా జరక్కపోవడంతో దుర్గంధం వెదజల్లుతోంది. నదిలోకి దిగే మెట్లపై నల్లటి నాచు పేరుకుపోయింది.
– సీటీఆర్‌ఐ(రాజమహేంద్రవరం)


