కడియం: వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. ఈ మేరకు గురువారం రాత్రి దుళ్లలో ఎంపీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ఆయన విస్తృత ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు మేలు చేసిన ఘనత గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కే చెల్లుతుందన్నారు. అయితే చంద్రబాబు మాత్రం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సైతం పట్టించుకోకుండా, ప్రజలను గాలికొదిలేశారన్నారు. ఇంతటి దారుణమైన ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ప్రజలు కష్టాల్లో ఉంటే వారిని పట్టించుకోకుండా, జగన్‌ను విమర్శించడానికే చంద్రబాబు ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు. జెడ్పీటీసీ అభ్యర్థి కొత్తపల్లి శివాజీ, ఎంపీపీ అభ్యర్థి తాడాల రాజరాజేశ్వరి, ఎంపీటీసీ అభ్యర్థులు ముసునూరి పద్మావతి, కొండపల్లి మల్లీశ్వరిలను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట మాజీ ఎంపీటీసీలు తోకల వీర వెంకట్రావు, టేకి శ్రీనివాసరావు, కట్టుంగ నాగరాజు ఉన్నారు.
ఫ పార్టీ జిల్లా అధ్యక్షుడు వేణు
ఫ దుళ్లలో విస్తృత ప్రచారం


