తుపాను కారణంగా కోనసీమ జిల్లాలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సెల్‌ఫోన్లకు చార్జింగ్ పెట్టుకునే వీలులేక మూగపోయాయి. దీంతో ప్రజలు ఎక్కడ విద్యుత్ ఉంటుందో అక్కడకు వెళ్లి తమ ఫోన్లకు చార్జింగ్ పెట్టుకున్నారు. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం అమలాపురం ఆర్టీసీ బస్టాండ్‌లో ఇలా చార్జింగ్ పెట్టుకుంటూ కనిపించారు.
– సాక్షి, ఫొటోగ్రాఫర్, రాజమహేంద్రవరం
అర్నబ్ తుపాను ధాటికి జిల్లాలో విద్యుత్ వ్యవస్థ పూర్తిగా ధ్వంసమవడంతో మూడు రోజులుగా పల్లెలన్నీ చీకట్లోనే మగ్గుతున్నాయి. ఇళ్లల్లోని ఇన్వర్టర్లు సైతం చార్జింగ్ అయిపోయి మొరాయించాయి. చార్జింగ్ లేక సెల్‌ఫోన్లు సైతం మూగపోయాయి. దీంతో, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇదే అదనుగా కొంతమంది జనరేటర్లతో ఫోన్లు, ఇన్వర్టర్ బ్యాటరీలకు చార్జింగ్ పెడుతున్నారు. దీనికోసం వారు భారీగానే వసూళ్లు చేస్తున్నప్పటికీ గత్యంతరం లేక పలువురు అక్కడ బారులు తీరుతున్నారు. అప్పనపల్లిలో ఇన్వర్టర్ బ్యాటరీ చార్జింగ్‌కు రూ.150 తీసుకోగా, మరికొన్ని గ్రామాల్లో గంటకు రూ.వెయ్యి వరకూ తీసుకున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
– మామిడికుదురు


