అట్లతద్దెకి వెళితే ఇల్లు దోచేశారు.. | - | Sakshi
Sakshi News home page

అట్లతద్దెకి వెళితే ఇల్లు దోచేశారు..

Oct 30 2026 12:39 AM | Updated on Oct 30 2026 12:39 AM

● ఉపాధ్యాయుడి ఇంట్లో భారీ చోరీ

● 23 కాసుల బంగారం అపహరణ

సీతానగరం: మండల కేంద్రమైన సీతానగరం దేవాంగుల వీధిలో నివాస ఉంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు వేల్పూరి వెంకటేశ్వరరావు ఇంట్లో బుధవారం రాత్రి భారీ చోరీ జరిగింది. 23 కాసుల బంగారు ఆభరణాలు, కడ్డీలు దొంగతానికి గురయ్యాయి. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం.. వేల్పూరి వెంకటేశ్వరరావు తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి అట్లతద్ది పండగ కోసం అత్తారింటికి వెళ్లారు. దొంగలు బుధవారం రాత్రి మారు తాళాలతో ప్రధాన ద్వారాన్ని తెరచి లోపలకు ప్రవేశించారు. అక్కడ బీరువాలోని 23 కాసుల బంగారు ఆభరణాలు, బంగారు కడ్డీలను అపహరించుకుపోయారు. ఇంటి తలుపులు తెరచి ఉండటాన్ని గమనించిన స్థానికులు గురువారం ఉదయం ఇచ్చిన సమాచారంతో వెంకటేశ్వరరావు ఇంటికి వచ్చి, చూడగా దొంగతనం విషయం బయటపడింది. సమాచారం అందుకున్న ఎస్సై ఎల్‌.శ్రీను నాయక్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్లూస్‌ టీమ్‌ రంగంలోకి దిగి వేలిముద్రలు, ఇతర ఆధారాలను సేకరించింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement