జీజీహెచ్‌లో రెండు హెల్ప్‌ డెస్క్‌లు | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో రెండు హెల్ప్‌ డెస్క్‌లు

Oct 13 2026 12:23 AM | Updated on Oct 13 2026 12:23 AM

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): ప్రభుత్వ ఆసుపత్రి అంటే హడావిడి, సమాచారం లేకపోవడం అనే అపోహను పోగొడుతూ రాజమహేంద్రవరం జీజీహెచ్‌ను కార్పొరేట్‌ స్థాయి సేవలతో తీర్చిదిద్దుతున్నామని సూపరింటెండెంట్‌ కె.రాంబాబు అన్నారు. ఆసుపత్రిలో రెండు హెల్ప్‌ డెస్క్‌లను సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన హెల్ప్‌ డెస్క్‌ ద్వారా ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వివిధ విభాగాలు, వైద్య సేవలు, డాక్టర్ల వివరాలు, ఓపీ సమయాలు, పరీక్షల వివరాలతోపాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగుల సమాచారాన్ని వారి బంధువులు తెలుసుకోవచ్చన్నా రు. అవయవ దానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా జీవన్‌ దాన్‌ హెల్ప్‌ డెస్క్‌ ఏర్పా టు చేసినట్టు తెలిపారు. 93901 11375 నంబరుకు ఫోన్‌ చేసి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య సేవల వివరాలు పొందవచ్చన్నారు. ప్రతిరోజూ ఉద యం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు హెల్ప్‌ డెస్క్‌ లు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

డీసీఈ బోర్డు సెక్రటరీగా రమణారావు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా డిస్ట్రిక్ట్‌ కామన్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు సెక్రటరీగా రంగంపేట మండలం దొంతమూరు హైస్కూల్‌ హెచ్‌ఎం కొండపల్లి వెంకటరమణారావును నియమిస్తూ జిల్లా విద్యాశాఖాధికారి కంది వాసుదేవరావు ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం బాధ్యతలు చేపట్టిన రమణారావుని ఆంధ్రప్రదేశ్‌ ప్రధానోపాధ్యాయ సంఘం రాష్ట్ర సహాధ్యక్షులు కోలా సత్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి మంగిన రామారావు తదితరులు అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement