రంగంపేట: ఉత్తమ విద్యాబోధనతోపాటు సృజనాత్మకతను పెంపొందిస్తూ, ఆదర్శ విద్యార్థులుగా తీర్చిదిద్దడంలో కృషి చేస్తున్న రంగంపేట హైస్కూల్ జీవశాస్త్ర ఉపాధ్యాయురాలు వినుకొండ రమ్యసుధ ‘గురుబ్రహ్మ’ అవార్డుకు ఎంపికయ్యారు. విశాఖపట్టణానికి చెందిన సెయింట్ మదర్ థెరిసా సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మెమోరియల్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని గాంధీనగర్ ప్రెస్ క్లబ్ సమావేశ మందిరంలో అసోసియేషన్ అధ్యక్షుడు కృష్ణమూర్తి అధ్యక్షతన రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎంపికై న 15 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులను అందజేశారు. వారిలో రమ్యసుధకు గురుబ్రహ్మ అవార్డు లభించింది. ఇప్పటికే జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో పలు అవార్డులను రమ్యసుధ అందుకున్నారు.


