సచివాలయ ఉద్యోగులు తమ న్యాయమైన హక్కుల కోసం శాంతియుతంగా ధర్నా చేస్తే కేసులు పెట్టడం ప్రభుత్వ నిరంకుశత్వానికి పరాకాష్ట. సచివాలయ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చేందుకు తక్షణమే ప్రభుత్వం చర్చలు జరపాలి. ఆందోళన చేశారని, యూనియన్ రాష్ట్ర నాయకులను సస్పెండ్ చేయడం మంచి పద్ధతి కాదు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది.
– టి.అరుణ్, సీపీఎం జిల్లా కార్యదర్శి
తక్షణమే సమస్యలు పరిష్కరించాలి
సచివాలయ ఉద్యోగుల సమస్యలను తక్షణమే పరిష్కరించి, వారి న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలి. విజయవాడ వెళ్లిన ఉద్యోగుల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం క్రూరంగా వ్యవహరించడం దారుణం. కూటమి ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేసి వారితో చర్చలు జరపాలి.
– జువ్వల రాంబాబు, సచివాలయ ఉద్యోగుల సంఘం నిడదవోలు ఏరియా గౌరవ అధ్యక్షుడు


