కోరుకొండ: హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం విమానాశ్రయానికి మంగళవారం రాత్రి 9.40కు చేరాల్సిన ఇండిగో విమాన సర్వీసు రద్దయ్యింది. హైదరాబాద్ నుంచి రావాల్సిన ఈ సర్వీసు తొలుత సాంకేతిక కారణాలతో రాత్రి 11.15 గంటలకు చేరుతుందని ప్రకటించారు. అయితే నిర్వహణాపరమైన కారణాలతో రద్దయినట్టు తెలిపారు. దీంతో హైదరాబాద్ వెళ్లాల్సిన ప్రయాణికులు ఇతర మార్గాల్లో తరలివెళ్లారు.
విజేతలు వారిద్దరే..
కోరుకొండ: మండలంలోని కోటికేశవరం ఎంపీపీ పాఠశాలలో ఎస్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా విచిత్రం చోటు చేసుకుంది. సాధారణంగా విద్యార్థుల తల్లిదండ్రులను సభ్యులుగా ఎన్నుకుని, వారిలో చైర్మన్, వైస్ చైర్మన్‌ను ఎంపిక చేస్తారు. కానీ ఈ పాఠశాలలో కేవలం ఇద్దరే విద్యార్థులు ఉండడంతో వారి తల్లులే సభ్యులుగా ఎంపికయ్యారు. వారే చైర్మన్, వైస్ చైర్మన్‌గా కొనసాగారు. కాగా.. కోరుకొండ మండలంలోని 55 పాఠశాలల్లో ఐదుచోట్ల ఎన్నికలను స్థానికులు బహిష్కరించారు.


