బోట్‌క్లబ్ (కాకినాడ): సమస్యలు పరిష్కరించాలని నిరసన తెలుపుతున్న సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు అమానుషమని వైఎస్సార్ సీపీ క్రిస్టియన్ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రెవరెండ్ స్టీఫెన్ ఆనంద్ అన్నారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని శాంతియుత ఆందోళన చేస్తున్న ఉద్యోగులపై దాడులు చేయడం దారుణమన్నారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రస్తుతం కొత్త పింఛన్ల పేరుతో స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో క్రిస్టియన్ మైనార్టీలమంతా సత్తా చూపుతామని, వైఎస్సార్ సీపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామన్నారు. ఈ విషయంలో క్రిస్టియన్ మైనార్టీలందరూ ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి శ్రేణులను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.


