అదుపు తప్పి.. వాగులోకి దూసుకెళ్లి.. | - | Sakshi
Sakshi News home page

అదుపు తప్పి.. వాగులోకి దూసుకెళ్లి..

Sep 30 2026 12:16 AM | Updated on Sep 30 2026 12:16 AM

● పొల్లూరు జలపాతం సమీపంలోకారు ప్రమాదం

● నలుగురు యువకులకు గాయాలు

మోతుగూడెం/చింతూరు: చింతూరు మండలం పొల్లూరు జలపాతం సమీపంలోని వాగులోకి మంగళవారం ఓ కారు అదుపు తప్పి పడిపోయింది. ఈ ఘటనలో కారులోని విజయవాడకు చెందిన శంకర్‌, సుభాష్‌, యోగేష్‌, విజయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న మోతుగూడెం ఎస్సై నాజర్‌ హుస్సేన్‌, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నలుగురు యువకులను మోతుగూడెం ఏపీ జెన్‌కో హాస్పిటల్‌కు, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందజేసి, పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఆ నలుగురు యువకులూ విజయవాడ నుంచి మోతుగూడెం, పోల్లూరు పర్యాటక ప్రాంతాలను చూడడానికి వచ్చినట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement