నిత్యాన్నదానానికి రూ.8,21,227 లక్షల విరాళాలు | - | Sakshi
Sakshi News home page

నిత్యాన్నదానానికి రూ.8,21,227 లక్షల విరాళాలు

Sep 29 2026 12:45 AM | Updated on Sep 29 2026 12:45 AM

అన్నవరం: స్థానిక సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి ఇద్దరు దాతలు రూ.8,21,227 లక్షల విరాళాలను సోమవారం సమర్పించారు. కాకినాడకు చెందిన గండికోట జానకి ప్రియాంక రూ.6,21,111 విరాళాన్ని సమర్పించారు. ఈ మొత్తంపై వచ్చే వడ్డీతో ఏటా అక్టోబర్‌ 21న వారి తండ్రి వెంకటేశ్వర వరప్రసాద్‌ పేరుపై అన్నదానం చేయాలని కోరారు. అదే విధంగా సత్యదేవుని నిత్యాన్నదాన పథకంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తమరాన ప్రసాద్‌ నాయుడు రూ.2,00,116 విరాళాన్ని అందించారు. దీనిపై వచ్చే వడ్డీతో ఏటా జనవరి 1న ఆయన తల్లి తమరాన ఆదిలక్ష్మి పేరు మీద అన్నదానం చేయాలని కోరారు. దాతలకు సత్యదేవుని చిత్రపటం, ప్రసాదం, అన్నదానం బాండ్‌లను దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement