ట్రాక్టర్‌ బోల్తా: డ్రైవర్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా: డ్రైవర్‌ మృతి

Sep 29 2026 12:45 AM | Updated on Sep 29 2026 12:45 AM

దేవరపల్లి: ట్రాక్టర్‌ బోల్తా పడిన ఘటనలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. చాగల్లు మండలం ఎస్‌.ముప్పవరం గ్రామానికి చెందిన మన్యం ఏడుకొండలు (27) ట్రాక్టర్‌ డ్రైవర్‌ గా పనిచేస్తున్నాడు. ఆదివారం ఉదయం ట్రాక్టర్‌పై ఎండుగడ్డి లోడ్‌ చేసుకుని ఎస్‌.ముప్పవరం నుంచి జంగారెడ్డిగూడెం వెళ్లి అన్‌లోడ్‌ చేసుకుని తిరిగి వస్తుండ గా, గోపాలపురం మండలం కరచర్లగూడెం వద్ద ప్ర మాదవశాత్తూ ఇంజన్‌ బోల్తా పడింది. ప్రమాదంలో ఏ డుకొండలు గాయపడగా, చికిత్స కోసం కొవ్వూరు ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్సై వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఏడుకొండలుకు భార్య, ఇద్దరు కుమారు లు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement