గంగవరం: పెద్దపులి మళ్లీ మండలంలో పశువులపై పంజా విసిరింది. రాజవొమ్మంగి, అడ్డతీగల మండలాల్లో అటవీ ప్రాంతాల్లో సంచరించిన పులి గంగవరం మండలానికి చేరుకుంది. మంగళవారం రాత్రి ఎండపల్లి గ్రామపంచాయతీ ఇ.రామవరం శివారు అటవీ ప్రాంతంలో ఓ పశువును హతమార్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. పెద్దపులి సంచారంతో అడ్డపల్లి, చిన్నఅడ్డపల్లి, ఇ.రామవరం, ఎండపల్లి, ఎల్లాపురం, మర్రిపాలెం, పరిసర గ్రామాల్లో ప్రజలను అటవీశాఖ సిబ్బంది అప్రమత్తం చేస్తున్నారు. ఇ.రామవరం అటవీ ప్రాంతంలో ఆవుపై దాడి చేసిన ప్రాంతాన్ని అటవీశాఖ సిబ్బంది పరిశీలించారు. పెద్దపులి పాదముద్రలను అటవీశాఖ సిబ్బంది గుర్తించారు. పెద్దపుల్లి సంచారంపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచి స్తున్నారు. పెద్దపులి సంచారంపై ప్రజలు భయాందోళన చెందుతున్నారని దానిని బంధించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఎండపల్లి మాజీ సర్పంచ్ బండారు రామలక్ష్మి అధికారులను కోరారు.


