ఫ జాతీయ సాఫ్ట్‌బాల్ పోటీలకు దీపిక
ఫ రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్‌కు సిద్ధార్థ
కాజులూరు: మండలంలోని గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన కాకరపల్లి లోకే శ్వరి దీపిక జాతీయ స్థాయి సాప్ట్ బాల్ పోటీలకు ఎంపికై ంది. ఈ మేరకు మంగళవారం పాఠశాలలో హెచ్‌ఎం ఎస్‌ఎస్‌బీ సుశీలమణి ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. పీడీ సునీల్ కుమార్ మాట్లాడుతూ బొబ్బిలిలో ఈ నెల 11, 12, 13 తేదీల్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ సాఫ్ట్ బాల్ పోటీలు జరిగాయన్నారు. ఆ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పలువురు క్రీడాకారులు పాల్గొనగా, జట్టులో తమ పాఠశాల తొమ్మిదవ తరగతి విద్యార్థిని దీపిక ప్రతిభ కనపరచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. మహారాష్ట్రలో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు జరిగే 39వ జాతీయస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీల్లో దీపిక రాష్ట్ర జట్టు తరఫున పోటీపడుతుందన్నారు. కాగా.. స్కూల్ కమిటీ మాజీ చైర్మన్ మాతా నాగరాజు, స్థానిక పీఏసీఎస్ డైరెక్టర్ బుంగ నాగేశ్వరరావు, బిరుదా సత్యనారాయణమూర్తి.. దీపికను అభినందిస్తూ కోచింగ్ క్యాంప్, ప్రయాణ ఖర్చులు నిమిత్తం ఆర్థిక సహకారం అందించారు.
సీతానగరం: రాష్ట్ర స్థాయి సైన్స్ సెమినార్‌కు మండలంలోని రామచంద్రపురం జెడ్పీహెచ్ స్కూల్ విద్యార్థి ఎస్.సిద్ధార్థ ఎంపికై య్యాడు. ఇండియన్ ఎనర్జీ బాస్కెట్ 2047 ప్రపోజల్ అండ్ ఛాలెంజెస్ అనే అంశంపై జరిగిన పోటీలో మండల స్థాయిలో గెలిచి, మంగళవారం రాజమహేంద్రవరం ఎస్‌కేవీటీ ప్రభుత్వ పాఠశాలలో జరిగిన సెమినార్‌లో ద్వితీయ స్థానంలో నిలిచాడు. తద్వారా ఈ నెల 24న విజయవాడలో జరగబోయే రాష్ట్ర స్థాయి సెమినార్‌కు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా విద్యార్థి సిద్ధార్థ, గైడ్ టీచర్ కె.సత్యశ్రీలను జిల్లా విద్యాశాఖ అధికారి కె.వాసుదేవరావు, జిల్లా సైన్స్ అధికారి నెహ్రూ, మండల విద్యాశాఖ అధికారులు కె.స్వామి నాయక్, ఎస్.ఉషారాణి, పాఠశాల హెచ్‌ఎం బి.లీనా ప్రణీత కుమారి, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు అభినందించారు.


