చోరీలకు పాల్పడుతున్న నలుగురి అరెస్టు | - | Sakshi
Sakshi News home page

చోరీలకు పాల్పడుతున్న నలుగురి అరెస్టు

Sep 23 2026 12:13 AM | Updated on Sep 23 2026 12:13 AM

వారిలో ఇద్దరు మైనర్‌ బాలురు

పరారీలో మరో నిందితుడు

ఏడు బైక్‌లు, దుస్తులు, సిగరెట్‌ ప్యాకెట్ల స్వాధీనం

గోకవరం: చోరీలకు పాల్పడుతున్న నలుగురు యువకులను గోకవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి ఏడు బైక్‌లు, దుస్తులు, సిగరెట్‌ ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలను మంగళవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కోరుకొండ సీఐ ఎస్‌వీవీఎస్‌ మూర్తి విలేకరులకు వెల్లడించారు. మండలంలోని వీరలంకపల్లి సెంటర్‌లో ఉన్న షాపులో ఈ నెల 5వ తేదీ అర్ధరాత్రి షాపు తాళాలు పగులగొట్టి సీసీ కెమెరాను ధ్వంసం చేసి, దానిలో దుస్తులు, కళ్లజోళ్లను దొంగలు చోరీ చేశారు. దీనిపై ఎస్సై పవన్‌ కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీనిలో భాగంగా రంపచోడవరానికి చెందిన కీలు శివ, గోకవరానికి చెందిన కామాకుల వినయ్‌ (గుండు), అడ్డతీగలకు చెందిన ఇద్దరు మైనర్‌ బాలురను అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో వారు వీరలంకపల్లిలో టీ షాపులో తాళాలు పగులగొట్టి సుమారు రూ.5 వేలు నగదు, సిగరెట్లు దొంగలించామని ఒప్పుకున్నారు. అలాగే కొంతమూరు, నల్లజర్ల హైవే పరిధిలో సుమారు ఏడు బైక్‌లు చోరీ చేశారని గుర్తించి, వీరి నుంచి ఏడు బైక్‌లు, సిగరెట్లు, దుస్తులు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. ఈ కేసులో మరో యువకుడు పరారీలో ఉన్నాడని సీఐ తెలిపారు. పట్టుబడిన వారిలో పలువురిపై అడ్డతీగల, రాజానగరం పోలీస్‌స్టేషన్లలో పాత కేసులు ఉన్నట్టు గుర్తించామన్నారు. నిందితులను రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరుస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement