వాహనం ఢీకొని వృద్ధురాలి మృతి | - | Sakshi
Sakshi News home page

వాహనం ఢీకొని వృద్ధురాలి మృతి

Sep 12 2026 12:24 AM | Updated on Sep 12 2026 12:24 AM

చింతూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన చింతూరు మండలం గొర్లగూడెం సమీపాన జాతీయ రహదారి–30పై శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గొర్లగూడెం – కన్నాపురం నడుమ రోడ్డుపై ఆమె మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారమిచ్చారు.

ఎస్సై సంతోష్‌ కుమార్‌ సంఘటన స్థలానికి చేరుకుని వృద్ధురాలి మృతదేహాన్ని చింతూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమె ఆచూకీ తెలియరాలేదని, ఆమెను ఢీకొన్న వాహనం ఆగకుండా వెళ్లిపోయిందని చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement