కంబాలచెరువు(రాజమహంద్రవరం): జిల్లాలో జరిగిన నేరాలపై ఎస్పీ డి.నరసింహాకిశోర్ అర్ధ వార్షిక నేర సమీక్ష బుధవారం నిర్వహించారు. పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సమావేశంలో జిల్లాలో నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్, అస్తి సంబంధిత నేరాలు, ఇతర కేసుల నమోదులపై పోలీస్ స్టేషన్ వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఎస్పీ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ మహిళల భద్రతకు ప్రాధాన్యమిచ్చి వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. పోలీసు స్టేషన్లకు వచ్చే ప్రజలతో మర్యాదగా వ్యవహరించి వారి సమస్యలు పరిష్కరించాలన్నారు. మాదకద్రవ్యాల నిరోధం, రహదారి నిబంధనలు, డ్రంక్ అండ్ డ్రైవ్, శాంతి భద్రతల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. రానున్న వినాయక చవితి, స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రణాళికా బద్ధంగా వ్యవహరించాలని ఆదేశించారు. విధి నిర్వహణలో ప్రతిభ చూపిన అధికారులను అభినందించారు. సమావేశంలో అదనపు ఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్, డీఎస్పీలు ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.


