నిడదవోలు
బాలికల ఉన్నత పాఠశాలలో చిరిగి, వేళ్లాడుతున్న
బ్యాగ్‌తో విద్యార్థిని
నిడదవోలు
మండలం
సమిశ్రగూడెం
జెడ్పీ హైస్కూలులో
చిరిగిన బ్యాగ్‌తో విద్యార్థి
విద్యార్థులకు చదువులు చెప్పిన గురుస్థానం నుంచి ఏకంగా దేశ రాష్ట్రపతి పదవిని అలంకరించిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణన్. అటువంటి గొప్ప నేత పేరిట ప్రభుత్వం ఓ పథకం ప్రారంభిస్తే.. దాని అమలు ఆ ‘భారతరత్న’ ప్రతిష్టను ఇనుమడింపజేసే స్థాయిలో ఉండాలి. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తీరు ఆవిధంగా లేదనే విమర్శలు సర్వత్రా వస్తున్నాయి.
సాక్షి, రాజమహేంద్రవరం/నిడదవోలు/నిడదవోలు రూరల్/రాజానగరం/రాజమహేంద్రవరం రూరల్/కడియం/రాయవరం/తాళ్లపూడి/చాగల్లు :
=== గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు జగనన్న విద్యా కానుక అందించేవారు. ఈ పథకం కింద నాణ్యమైన స్కూల్ బ్యాగ్, పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్‌లు, వర్క్ బుక్‌లు, మూడు జతల యూనిఫామ్, జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్, ఇంగ్లిష్ – తెలుగు నిఘంటువు వంటివి ఇచ్చేవారు. పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులకు ఈ కానుక అందించేవారు. యూనిఫాం కుట్టించుకోవడానికి చార్జీలు సైతం నాటి ప్రభుత్వం ఇచ్చేది.
గత ఎన్నికల్లో గద్దెనెక్కిన చంద్రబాబు ప్రభుత్వం.. ఈ పథకం పేరును శ్రీసర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రశ్రీగా మార్చినట్లు గొప్పగా చెప్పింది. అంతటి మహనీయుని పేరును పెట్టినప్పుడు ఈ పథకం అమలు కూడా అంత గొప్పగానూ ఉండాలి. కానీ, ప్రభుత్వం అందించిన విద్యార్థి మిత్ర కిట్లు పూర్తి నాణ్యతా లోపంతో ఉన్నాయి. ముఖ్యంగా బ్యాగులు దారుణంగా ఉన్నాయి. పాఠశాలలు తెరచి రెండు నెలలు గడిచింది. ఇంతలోనే విద్యార్థులకు సర్కారు వారు అందించిన బ్యాగులకు జిప్పులు ఊడిపోయాయి. చిరిగిపోయాయి.. హ్యాండిల్స్ తెగిపోయాయి. వాటిని వినియోగించలేక కొంత మంది విద్యార్థులు తిరిగి స్కూళ్లలో వెనక్కి ఇచ్చేశారు. మరికొంత మంది గత్యంతరం లేక చిరిగిన బ్యాగ్‌ను కుట్టుకుని ఏదోలా వినియోగిస్తున్నారు. మరికొందరు పిన్నీసులు పెట్టుకుని.. వీపుపై తగిలించుకునే వీలు లేక పుస్తకాల బ్యాగును ధాన్యం బస్తా మాదిరి నెత్తి మీద పెట్టుకుని స్కూల్‌కు మోసుకెళ్తున్నారు. కాస్త ఆర్థిక స్తోమత ఉన్నవారు తమ పిల్లలకు వేరే బ్యాగులు కొనిచ్చి స్కూళ్లకు పంపిస్తున్నారు. ఒక్కో కిట్టుకు రూ.2,300కు పైగా వెచ్చించామని ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా.. బ్యాగుల్లో కనీస నాణ్యత లేకపోవడం గమనార్హం. బూటకపు హామీలతో అధికారంలోకి వచ్చి.. అన్ని వర్గాలకూ వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు, లోకేశ్, పవన్‌లు చివరకు విద్యార్థులను సైతం వదల్లేదని, నాసిరకం విద్యార్థి మిత్ర కిట్లు సరఫరా చేసి, వారికీ వెన్నుపోటు పొడిచారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నాణ్యత లేని బూట్లు, యూనిఫాం
మరోవైపు విద్యార్థి మిత్ర కిట్‌లో అందజేసిన యూనిఫాం, బూ ట్లలో కూడా నాణ్యత లేదనే విషయం క్షేత్ర స్థాయి పరిశీలనో స్పష్టమవుతోంది. జిల్లాలోని 1,148 పాఠశాలల్లో చదువుతున్న 93,849 మంది విద్యార్థులకూ విద్యార్థి మిత్ర కిట్లు అందజేశామని విద్యా శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా క్షేత్ర స్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా చాలా మంది విద్యార్థులు సివిల్ డ్రెస్‌లో, సొంత బ్యాగులు తీసుకుని, చెప్పులు వేసుకుని స్కూళ్లకు రావడమే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది.
రాజమహేంద్రవరం రూరల్ బొమ్మూరు జీపీఆర్ జెడ్పీ హైస్కూల్‌లో చిరిగిన బ్యాగ్‌తో విద్యార్థి
రాజానగరం జెడ్పీ హైస్కూలు లో
చిరిగిన బ్యాగుతో..
రాజానగరం జెడ్పీ హైస్కూలులో చెప్పులు, సివిల్ డ్రెస్, సొంత బ్యాగులతో..
నాసిరకంగా స్కూల్ బ్యాగులు
ఊడుతున్న జిప్పులు
తెగుతున్న హ్యాండిల్స్
చిరిగిపోతూండటంతో తిరిగి
ఇచ్చేసిన కొందరు విద్యార్థులు
కుట్లు వేసుకుని వాడుతున్న
మరి కొంత మంది


