ప్రియాంక కేసులో సీన్‌ రీక్రియేషన్‌ | - | Sakshi
Sakshi News home page

ప్రియాంక కేసులో సీన్‌ రీక్రియేషన్‌

Aug 21 2026 12:22 AM | Updated on Aug 21 2026 12:22 AM

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు అధికారి పాటిల్‌ దేవరాజ్‌ మనీష్‌ నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది. నిందితులు సూరారపు ధస్వంత్‌, ఆండ్రు జోసెఫ్‌ ఎడ్వర్డ్‌లను పోలీసులు సెంట్రల్‌ జైలు నుంచి బుధవారం మధ్యాహ్నం తమ కస్టడీకి తీసుకుని విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. రెండు రోజుల విచారణలో భాగంగా గురువారం ఇద్దరు నిందితులను విచారించి, పలు కీలక వివరాలు సేకరించారు. ఈ నెల 3న స్థానిక ప్రసాదిత్య మాల్‌ వద్ద ప్రియాంకను కారుతో ఢీకొట్టి వెళ్లిపోయిన తర్వా త నిందితులు ఎక్కడ దాక్కున్నారు, మద్యం ఎ క్కడ కొనుగోలు చేశారు, ఏ ప్రాంతంలో తాగా రు, ఆ కారును ఎక్కడ దాచిపెట్టారనే విషయాలను పోలీసులు అడిగినట్లు సమాచారం. తొలుత నిందితుడు ధస్వంత్‌ను మోరంపూడిలోని అతడి ఇంటికి తీసుకెళ్లారు. తర్వాత మున్సిపల్‌ కాలనీలోని జోసెఫ్‌ ఎడ్వర్డ్‌ ఇంటికి పోలీసులు వెళ్లారు. అక్కడి నుంచి ఘటన జరిగిన ప్రసాదిత్య మాల్‌ కు తీసుకెళ్లి సీన్‌ రీ క్రియేషన్‌ చేశారు. మాల్‌లోని సెక్యూరిటీ సిబ్బందిని పలు ప్రశ్నలు అడిగారు. వారితో నిందితుల వాగ్వాదం, ఆ తర్వాత వారు ఎలా ప్రవర్తించారో అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రక్రియ మొత్తం వీడియో రికార్డు చేశారు. విచారణ అనంతరం దీనిని న్యాయమూర్తికి అందజేయనున్నారు. పోలీసు కస్టడీ గడువు శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు పూర్తి కానుండటంతో విచారణ వేగవంతం చేశారు. ఈ కేసు దర్యాప్తు నుంచి డీఎస్పీ సుభాష్‌ను తప్పించారు.

ఆలమూరు మాజీ ఎంపీపీ

తమ్మనకు బెయిల్‌

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కూటమి నేతలు కక్ష సాధింపుతో పెట్టిన అక్రమ కేసులో ఈ నెల 17న అరెస్టయిన వైఎస్సార్‌ సీపీ నేత, కోనసీమ జిల్లా ఆలమూరు మాజీ ఎంపీపీ తమ్మన శ్రీనివాస్‌కు గురువారం బెయిల్‌ మంజూరైంది. సాయంత్రం 6.30 గంటల సమయంలో ఆయనను జైలు అధికారులు విడుదల చేశారు. జైలు వద్ద వైఎస్సార్‌ సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, ఆ పార్టీ అమలాపురం పార్లమెంటరీ పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, మాజీ ఎంపీ చింతా అనురాధ తదితరులు తమ్మనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జగ్గిరెడ్డి మాట్లాడుతూ, దాదాపు రెండు దశాబ్దాల క్రితం నిర్మించిన వంతెనకు తమ పేరు పెట్టాలని ప్రయత్నించిన టీడీపీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చర్యలను ప్రశ్నించిన తమ్మనపై టీడీ పీ నేతలు అక్రమ కేసులు పెట్టినా న్యాయమే గెలిచిందన్నారు. మాజీ ఎంపీ అనురాధ, జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, టీడీపీ ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా వైఎస్సార్‌ సీపీ శ్రేణులను ఎవ్వరూ ఆపలేరని అన్నారు. తమ్మనను నాయకులు, కార్యకర్తలు భారీ ఊరేగింపుగా ఆయన స్వగ్రామం చెముడులంక తీసుకెళ్లారు.

25న జెడ్పీ సమావేశం

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఈ నెల 25న ఉదయం 10.30 గంటలకు జెడ్పీ చైర్మన్‌ విప్పర్తి వేణుగోపాలరావు అధ్యక్షతన జరుగనుంది. ఈ విషయాన్ని జెడ్పీ సీఈఓ లక్ష్మణరావు గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement