రాజమహేంద్రవరం సిటీ/రాజానగరం: ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ట్రైబల్ విభాగంలో రాజానగరం మండలం కొత్త తుంగపాడు గ్రామానికి చెందిన ఫొటోగ్రాఫర్ గొల్లపల్లి అభిరామ్ రాష్ట్ర స్థాయి పురస్కారం దక్కించుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో ఫ్యాకల్టీ హుస్సేన్ ఖాన్ ఆధ్వర్యంలో గిరిజన జీవన స్థితిగతులపై నిర్వహించిన వర్క్ షాప్‌లో అభిరాం ఉత్తమ ప్రతిభ కనబరిచాడు. ఇప్పటికే పలుమార్లు జాతీయ అవార్డులు అందుకున్న ఆయన ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా బుధవారం తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో మరోసారి హుస్సేన్ చేతుల మీదగా పురస్కారాన్ని అందుకున్నారు. ఇష్టమైన రంగంలో ప్రతిభను చాటుకోవాలనే ఇటువంటి వర్క్‌షాప్‌లలో పాల్గొని అవార్డులు అందుకుంటున్నట్టు తెలిపారు.


