పెరవలి: మండలం ముక్కామల వద్ద బాపన్న కాలువలో మంగళవారం గల్లంతైన ఏడిద రవితేజ (41) మృతదేహం పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం రామన్నపాలెంలో లభ్యమైనట్టు ఎసై అలెగ్జాండర్ తెలిపారు. కాలువలో స్నానానికి దిగి ప్రమాదశాస్తూ కాలువలో కొట్టుకుపోయిన రవితేజ మంగళవారం ఉదయం నుండి రాత్రి వరకు గాలించినా దొరకని విషయం తెలిసిందే. మంగళవారం కేసు నమోదు చేశామని, మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగిస్తామని ఎస్సై తెలిపారు.
రూ.లక్ష విలువైన
గడ్డివామి దగ్ధం ˘
దేవరపల్లి: మండలంలోని బుచ్చియపాలెంలో మంగళవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో కాట్రు వీరవెంకటసత్యనారాయణకు చెందిన గడ్డివామి దగ్ధమైంది. గ్రామ శివారున ఉన్న తన పొలంలో సుమారు రూ.1 లక్ష విలువైన వెయ్యి కట్టల ఎండుగడ్డి పూర్తిగా కాలిపోయినట్టు రైతు వీర వెంకటసత్యనారాయణ తెలిపారు. కొవ్వూరు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. గడ్డివామి సమీపంలో పొగాకు బ్యారన్లు, రూ.లక్షల విలువ గల పొగాకు బేళ్లు ఉన్నాయని, ప్రమాద సమయంలో గాలి లేకపోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని ఆయన తెలిపారు.


