భట్రాజు సంఘం జిల్లా కార్యవర్గాల ఎన్నిక | - | Sakshi
Sakshi News home page

భట్రాజు సంఘం జిల్లా కార్యవర్గాల ఎన్నిక

Aug 10 2026 12:16 AM | Updated on Aug 10 2026 12:16 AM

కొత్తపేట: ఆంధ్రప్రదేశ్‌ భట్రాజు సంఘం జిల్లా శాఖల కార్యవర్గాల ఎన్నిక రాష్ట్ర సంఘం అధ్యక్షుడు చక్రాల ఫకీర్‌రాజు ఆధ్వర్యంలో జరిగింది. ఆదివారం కొత్తపేటకు సమీపంలోని కపిలేశ్వరపురం మండలం వీధివారిలంక గ్రామంలో ధనమ్మతల్లి మర్రి వద్ద ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా భట్రాజుల సంఘం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్ర భట్రాజు అధ్యక్షుడు, విశిష్ట సేవా రత్న అవార్డు గ్రహీత చక్రాల ఫకీర్‌రాజు, ప్రధాన కార్యదర్శి చింతా సతీష్‌రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అనంతరం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు జిల్లాల కార్యవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కోనసీమ జిల్లా అధ్యక్షునిగా చింతా నాగరాజు, కార్యవర్గాన్ని, తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షునిగా చుక్కన సుబ్బరాజు (తాతాజీ), కాకినాడ జిల్లా అధ్యక్షునిగా పెంటపాటి రామకృష్ణ రాజు (రాంబాబు) ఇతర కార్యవర్గాలను ఏర్పాటు చేసారు. జిల్లా నూతన అధ్యక్షులకు ఎన్నిక ధ్రువీకరణ పత్రాలను ఫకీర్‌రాజు అందచేశారు. ఇతర జిల్లాల కార్యవర్గాలను త్వరలో ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్‌ రాజు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement