మహిళలు సైతం ప్రమాదకరంగా ప్రయాణిస్తూ..
ఎ.కొత్తపల్లి–తొండంగి రహదారిలో పరిమితికి మించిన ప్రయాణికులతో..
కళ్లముందే రహదారి ప్రమాదాలు జరుగుతున్నా ప్రజల్లో మార్పు రావడం లేదు. రహదారి నిబంధనలను బేఖాతరు చేస్తూ పరిమితికి మించి ప్యాసింజర్ వాహనాల్లో రాకపోకలు సాగిస్తూ ప్రమాదాలను ఆహ్వానిస్తున్నారు. ఆషాఢమాసం కావడంతో కాకినాడ పరిసర ప్రాంతాలు, కోనసీమ జిల్లాకు బీచ్‌రోడ్డు దగ్గరి మార్గం కావడంతో తుని మండలం నుంచి అన్నవరం మీదుగా, తేటగుంట తిమ్మాపురం మీదుగా తొండంగి, ఒంటిమామిడి, పెరుమాళ్లపురం బీచ్‌రోడ్డు మీదుగా కాకినాడ వెళ్తున్నారు. ఒంటిమామిడి వద్ద పోలీస్‌స్టేషన్ ఉన్నప్పటికీ నిమిత్త మాత్రమే. అధికారులు ప్రమాదకరంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉందని పలువురు కోరుతున్నారు. – తొండంగి


