జిల్లా జడ్డి శ్రీనివాస్
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): ఆధునిక సమాజంలో తైక్వాండో వంటి క్రీడలు ఆత్మరక్షణకు అవసరమని జిల్లా జడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం జిల్లా తైక్వాండో సంఘం ఆధ్వర్యంలో జిల్లాస్థాయి పోటీలు ఘనంగా జరిగాయి. పోటీల ప్రారంభ కార్యక్రమానికి తైక్వాండో సంఘ కార్యదర్శి బి.అర్జునరావు అధ్యక్షత వహించారు. అతిథులుగా డీఎస్‌డీఓ సతీష్ కుమార్; తైక్వాండో సంఘ అధ్యక్షుడు మధుసుదనరావు హాజరయ్యారు. ముఖ్య అతిథి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వచ్చిన క్రీడాకారులను అభినందించారు. డీఎస్‌డీఓ సతీష్‌కుమార్ ఈ ఏడాది శాప్ సహకారంతో డీఎస్‌ఏ ఆధ్వర్యంలో వేసవి తైక్వాండో శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించిన బి.అర్జునరావును అభినందించారు. సబ్ జూనియర్స్, జూనియర్స్, సీనియర్స్, క్యాడెట్ విభాగంలో 42 కేజీల విభాగాల్లో బాలురకు, బాలికలు వేరువేరుగా నిర్వహించిన పోటీలకు 350 మంది హాజరయ్యారు. విజేతలకు సతీష్‌కుమార్, అర్జునరావు పతకాలు అందజేశారు.


