మాజీ ఎంపీ మార్గాని
భరత్‌రామ్ విమర్శ
రాజమహేంద్రవరం సిటీ: బీసీ నాయకులపై కక్షగట్టి టీడీపీ ఎమ్మెల్యేలు అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్ సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ గురువారం ఒక ప్రకటనలో విమర్శించారు. బీసీ విభాగం నగర అధ్యక్షుడు పీతా రామకృష్ణను పీడీ యాక్ట్ కింద పోలీసులు అరెస్టు చేసి, సెంట్రల్ జైలులో పెట్టడం, విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనతో కలసి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని తాడేపల్లిలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశామని భరత్‌రామ్ వెల్లడించారు. ఈ సందర్భంగా పీతా రామకృష్ణ విడుదల కోసం పార్టీ ఆధ్వర్యాన చేపట్టిన పోరాటాలను వివరించారు. రామకృష్ణను అరెస్టు చేయగానే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల బీసీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహిం,చి ఐక్య కార్యాచరణ ద్వారా ఉద్యమానికి సిద్ధమైనట్లు తెలిపారు. కలెక్టర్‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేశామని, న్యాయపోరాటానికి కూడా సిద్ధమయ్యామని వివరించారు. ఈ నేపథ్యంలో పీడీ యాక్ట్ చెల్లదంటూ రామకృష్ణను జైలు నుంచి విడుదల చేశారని ఆయన తెలిపారు. బీసీ జేఏసీ ఉభయ రాష్ట్రాల చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు కూడా అధినేతను కలిసినట్టు భరత్‌రామ్ పేర్కొన్నారు.


