టీచర్ పోస్టులు భర్తీ చేస్తామంటూ గొప్పగా ప్రారంభించిన మెగా డీఎస్సీ.. దగా డీఎస్సీగా మారిపోయింది. స్పోర్ట్స్ కోటా జీఓలను ఇష్టారాజ్యంగా మార్చేసి, సొంత వారికి ఉద్యోగాలిచ్చేశారు. నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత మళ్లీ జీఓలు మార్చేశారు. దేశ చరిత్రలో ఎక్కడా ఇంత దారుణంగా ఉద్యోగాల భర్తీ జరగలేదు. ఈ అక్రమాలు వెలుగులోకి రావాలంటే సీబీఐ విచారణ జరిపించాల్సిందే.
– డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి,
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ అనపర్తి
నియోజకవర్గ కో ఆర్డినేటర్
లోకేశ్ తప్పుకోవాలి
డీఎస్సీలో అక్రమాలకు విద్యా శాఖ మంత్రి లోకేశ్‌దే పూర్తి బాధ్యత. అవకతవకలు జరిగాయని, అర్హులకు అన్యాయం జరిగిందని మాజీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే ఆధారాలు చూపించారు. అయినప్పటికీ లోకేశ్ తప్పుకోవడం లేదు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తరహాలోనే అదే ఎన్‌డీఏలో భాగస్వామి అయిన లోకేశ్ కూడా నైతిక బాధ్యత వహిస్తూ తక్షణమే రాజీనామా చేయాలి. అప్పటి వరకూ వైఎస్సార్ సీపీ తరఫున పోరాటం కొనసాగిస్తాం.
– తోట త్రిమూర్తులు, ఎమ్మెల్సీ, వైఎస్సార్ సీపీ మండపేట నియోజకవర్గ కో ఆర్డినేటర్


