రైలు నుంచి జారి పడి మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారి పడి మహిళ మృతి

Jul 13 2026 12:16 AM | Updated on Jul 13 2026 12:16 AM

సామర్లకోట: స్థానిక కాకినాడ రోడ్డులోని 426 ఎల్‌సీ రైల్వే గేటు సమీపంలో గోదావరి కాలువ వంతెన ఎదురుగా ఆదివారం రైలు నుంచి జారిపడి ప్రయాణికురాలు మృతి చెందింది. రైల్వే పోలీసుల కథనం ప్రకారం ఒడిషా రాష్ట్రం, బద్రక్‌కు చెందిన సునీత (33) చెన్‌సై నుంచి పశ్చిమ బెంగాల్‌కు కోరమండల్‌( 12842) చైన్నె సెంట్రల్‌ నుంచి హౌరా వెళుతున్న రైలులో ప్రయాణం చేస్తుంది. రైలు సామర్లకోట రైల్వే స్టేషన్‌ దాటిన కొద్ది సమయానికి రైలు బోగి నుంచి జారీ కింద పడి పొయింది. విశాఖపట్నం నుంచి రాజమహేంద్రవరం వెళుతున్న (67286) రైలు లోకో పైలెట్‌ స్టేషన్‌ డ్యూటీలో ఉన్న సూపరింటెండెంట్‌, ఆర్‌పీఎప్‌, జీఆర్పీ సిబ్బందికి సమాచారం ఇచ్చిన్నట్లు రైల్వే స్టేషన్‌ మేనేజరు ఎం రమేష్‌ తెలిపారు. ఆమె వద్ద దొరికిన ఆధారాలతో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఆటో తిరగబడి

వృద్ధుడి మృతి

కపిలేశ్వరపురం: మండలంలోని వెదురుమూడి ఆర్‌అండ్‌బీ రహదారిలో ఆదివారం ఆటో తిరగబడి అందులో ప్రయాణిస్తున్న వృద్ధుడు మంగెన కృష్ణమూర్తి (60) మృతి చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యారు. అంగర ఎస్సై జి.హరీష్‌కుమార్‌ కథనం ప్రకారం కృష్ణమూర్తి ఆయన మనుమరాలు మంగిన వీరచంద్రిక సాయంతో కాకినాడ ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించుకుని తిరుగు ప్రయాణంలో మండపేటలో ఆటో ఎక్కారు. వెదురుమూడి సత్రం సమీపంలో బైక్‌ సడన్‌గా రావడంతో ఆటో తిరగబడి ప్రమాదం జరిగింది. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. 108లో మండపేట సీహెచ్‌సీకి తరలిస్తుండగా మార్గమధ్యలో కృష్ణమూర్తి మృతి చెందారు. వీరచంద్రిక ఫిర్యాదుపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సముద్ర స్నానానికి వెళ్లి

ఐటీఐ విద్యార్థి మృతి

కాకినాడ రూరల్‌: కాకినాడ – ఉప్పాడ బీచ్‌ రోడ్డులో నేమాం వద్ద సముద్ర స్నానానికి వెళ్లిన ఐటీఐ విద్యార్థి వనుం తేజసాయిప్రకాష్‌ (17) మృతి చెందాడు. పిఠాపురం మండలం నర్సింగపురం గ్రామానికి చెందిన తేజసాయి ప్రకాష్‌ నేమం ఎల్విన్‌ పేటలో అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటున్నాడు. శనివారం సెలవు కావడంతో ఎనిమిది మంది స్నేహితులతో కలిసి బీచ్‌లో చౌదరి గెస్ట్‌హౌస్‌ పక్కన స్నానానికి వెళ్లారు. అలల ఉధృతికి ప్రకాష్‌ గల్లంతయ్యాడు. స్నేహితుల ఫిర్యాదుతో తిమ్మాపురం ఎస్సై గణేశ్‌బాబు ఘటనా స్థలానికి చేరుకుని స్థానిక మత్స్యకారులతో గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం సాయంత్రం మృతదేహం ఒడ్డుకు చేరింది. ఆదివారం పోస్ట్‌మార్టం అనంతరం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని అప్పగించారు.

వాహనం ఢీకొని

ఏడు పశువులు మృతి

చింతూరు: మండలం సరివెలలో జాతీయ రహదారిపై వున్న పశువులను శనివారం అర్ధ రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. రోడ్డుపై ఉన్న 30 పశువులలో 7 అక్కడికక్కడే మృతి చెందినట్టు స్థానికులు తెలిపారు. నష్టం విలువ సుమారు రూ.2 లక్షలు ఉంటుందని యజమాని ముర్రం లక్ష్మయ్య తెలిపాడు.

అక్కా తమ్ముళ్ల

అదృశ్యంపై కేసు

పెద్దాపురం: పట్టణంలోని నాయిబ్రాహ్మణ కాలనీకి చెందిన అక్క తమ్ముళ్ల అదృశ్యంపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. నాయీ బ్రాహ్మణ కాలనీకి చెందిన 19 ఏళ్ల సీహెచ్‌ వీరసత్య, 15 ఏళ్ల తమ్ముడు బాలఏసు ఆదివారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లి ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి సీహెచ్‌ లక్ష్మీ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement