కాకినాడ వేదికగా జాతీయ రోలర్‌ స్కేటింగ్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

కాకినాడ వేదికగా జాతీయ రోలర్‌ స్కేటింగ్‌ పోటీలు

Jul 13 2026 12:16 AM | Updated on Jul 13 2026 12:16 AM

సోమవారం నుంచి 17 వరకు పోటీలు

నాగమల్లితోట జంక్షన్‌(కాకినాడ సిటీ): రోలర్‌ స్కేటింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలో, తూర్పు గోదావరి జిల్లా స్కేటింగ్‌ సంఘం సహకారంతో కాకినాడ జాతీయ ఓపెన్‌ రోలర్‌ స్కేటింగ్‌పోటీలకు వేదికయింది. ఈ నల 13 నుంచి 17 వరకు పోటీలు జరగనున్నాయి. దేశ వ్యాప్తంగా 850 మంది స్కేటర్లు పోటీలకు రిజిస్టర్‌ చేసుకున్నారు. పద్దెనిమిది మంది రిఫరీలు పోటీల నిర్వహణలో సహకారం అందించనున్నారు. ఏర్పాట్లను జిల్లా స్కేటింగ్‌ సంఘ అధ్యక్షుడు రాజ్‌గోపాల్‌, కార్యదర్శి స్వామి, ట్రెజరర్‌ స్వామి ఆదివారం పర్యవేక్షించారు.

టెన్నికాయిట్‌ జాతీయ స్థాయి పోటీలకు

జిల్లా జట్టు ఎంపిక

దేవరపల్లి: జాతీయ స్థాయి టెన్నీకోయిట్‌ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారు. ఈ నెల 11, 12 తేదీల్లో ప్రకాశం జిల్లా జరుగుమల్లిలో జరిగిన 38వ రాష్ట్ర స్థాయి సబ్‌ జూనియర్‌ టెన్నికాయిట్‌ చాంపియన్‌లో వీరు ప్రతిభ చూపి ఎంపికై నట్టు శాప్‌ డైరెక్టర్‌, రాష్ట్ర టెన్నీకోయిట్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పేరం రవీంధ్రనాధ్‌, జిల్లా అధ్యక్షుడు గద్దే చంద్రశేఖర్‌, కార్యదర్శి ఆచంట వెంకటేశ్వరరావు ఆదివారం తెలిపారు. అక్టోబరు 17 నుంచి 21 వరకు పంజాబ్‌ రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగే జాతీయస్థాయి సబ్‌ జూనియర్‌ చాంపియన్‌షిప్‌కు వీరు ఎంపికై నట్టు ఆయన తెలిపారు. దేవరపల్లి మండలం దుద్దుకూరు జెడ్పీ హైస్కూలు విద్యార్ధి ఆకాష్‌ బాబు, రామన్నపాలెం జెడ్పీ హైస్కూలు విద్యార్ధినులు ప్రియదర్శిని, లాస్య ఎంపిక కావడం జిల్లాకు గర్వకారణమని ఆయన అన్నారు.

మద్యం తాగారని పాపికొండలకు నిరాకరణ

దేవీపట్నం: పాపికొండలు విహార యాత్రకు వచ్చిన పది మంది పర్యాటకులను బోటు నిర్వహకులు నిరాకరించారు. 16 మంది ఆన్‌లైన్‌ టికెట్‌లు బుక్‌ చేసుకుని ఆదివారం పోశమ్మ గండి వద్ద బోట్‌ పాయింట్‌కు చేరుకున్నారు. వారిలో పది మంది మద్యం తాగి ఉన్నట్లు గుర్తించి పర్యటనకు అనుమతించలేదు. వారితో పాటు వచ్చిన మరో ఆరుగురు కూడా తిరిగి వెళ్లియారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement