ఏపీఎస్‌ఈబీ ఇంజినీర్స్ అసోసియేషన్ డిమాండ్
రాజమహేంద్రవరం సిటీ: విద్యుత్ రంగంలోని ఇంజినీర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు, 1999–2004 మధ్య విద్యుత్ సంస్థల్లో నియమితులైన ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఏపీఎస్‌ఈబీ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కపల్లి శామ్యూల్ డిమాండ్ చేశారు. ఆదివారం రాజమహేంద్రవరంలో నిర్వహించిన అసోసియేషన్ వార్షిక సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న పెన్షన్ సమస్యను తక్షణమే పరిష్కరించాలన్నారు. అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కె.నాగప్రసాద్, అసోసియేట్ అధ్యక్షుడు కేవీ రామారావు, అదనపు ప్రధాన కార్యదర్శి డి.నాగరాజు, కేంద్ర కార్యవర్గ సభ్యులు పి.బాలాజీ, రమేష్, కృష్ణప్రసాద్, 500 మందికి పైగా ఇంజినీర్లు పాల్గొన్నారు.


