చిందేసి.. చికాకు పుట్టించి | - | Sakshi
Sakshi News home page

చిందేసి.. చికాకు పుట్టించి

Mar 13 2026 7:58 AM | Updated on Mar 13 2026 7:58 AM

కాట్రేనికోన: ఎంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించే జాతరలో కొందరి చిందులు హద్దులు దాటాయి.. భక్తులకు రోత పుట్టించాయి. కాట్రేనికోన మండలం కొత్తపాలెం, మొల్లేటిమొగ గ్రామాల్లో మహాలక్ష్మి అమ్మవారి జాతర మహోత్సవాల్లో పోలీసుల సాక్షిగా బుధవారం రాత్రి మద్యం అమ్మకాలు, అశ్లీల నృత్యాలతో యువతను రెచ్చగొట్టారు. ఈ రెండు గ్రామాల్లో మహాలక్ష్మి అమ్మవారి మహోత్సవాల సందర్భంగా మాంసాహారాన్ని వదిలి ప్రజలు అత్యంత పవిత్రంగా పూజలు చేస్తారు. అయితే ఇక్కడ రాత్రి పగలు తేడా లేకుండా గ్రామాల్లో టెంట్లు వేసి మద్యం విక్రయాలు చేపట్టారు. గ్రామంలో జాతర సందర్భంగా స్టేజ్‌ మీద అమ్మాయిలు అశ్లీల నృత్యాలతో రెచ్చిపోయారు. అయితే రికార్డింగ్‌ డ్యాన్స్‌లను అడ్డుకోవాల్సిన పోలీసులు మాత్రం స్టేజ్‌కు ఎదురుగా ప్రేక్షకుల్లా కూర్చుని వీక్షించడం శోచనీయం. మద్యం అమ్మకాలు లైసెన్సు షాపుల మాదిరిగా చేసినా పోలీసులు, ఎకై ్సజ్‌ శాఖ సిబ్బంది పట్టించుకోలేదు. ఇటీవల శివరాత్రి సందర్భంగా మగసానితిప్ప, చొల్లంగి తీర్థంలో, తీర ప్రాంతాల్లో అమ్మవారి జాతరలు, చెయ్యేరు ప్రభల తీర్థంలో అశ్లీల రికార్డింగ్‌ డ్యాన్స్‌లు నిర్వహించినా ఎవరూ పట్టించుకోలేదు. దీనివెనుక కొందరు నాయకులు ఉండి నడిపిస్తున్నట్లు సమాచారం.

జాతరలో అశ్లీల నృత్యాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement