క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతమే లక్ష్యం

Mar 12 2026 7:35 AM | Updated on Mar 12 2026 7:35 AM

వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌బాబు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ)/కాకినాడ రూరల్‌: పార్టీ జిల్లా ఎస్సీ సెల్‌ను గ్రామగ్రామాన బలోపేతం చేయడం ద్వారా రానున్న రోజుల్లో పార్టీకి మంచి భవిష్యత్‌ ఉంటుందని పార్టీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్‌ సుధాకర్‌బాబు పిలుపునిచ్చారు. కాకినాడ సూర్యకళామందిర్‌లో బుధవారం పార్టీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్‌రాజా అధ్యక్షనత జరిగిన పార్టీ జిల్లా ఎస్సీ సెల్‌ సమావేశంలో సుధాకర్‌బాబు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. పార్టీ శ్రేణులు సమష్టిగా కృషి చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సమావేశం విజయవంతానికి సహకరించిన పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డిలను వైఎస్సార్‌ సీపీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్‌బాబు, పార్టీ జిల్లా ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు శెట్టిబత్తుల కుమార్‌రాజా సత్కరించారు. మాజీ ఎంపీ చింతా అనురాధ, పార్టీ జిల్లా మహిళ అధ్యక్షురాలు వర్ధినీడి సుజాత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సుంకర విద్యాసాగర్‌, పార్టీ గోదావరి జిల్లాల యువజన విభాగం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తోట రాంజీ, కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, పార్టీ నేతలు పెదపాటి అమ్మాజీ, కాశి మునికుమారి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శులు పలివెల సుధాకర్‌, గుల్లా ఏడుకొండలు, క్రీస్టియన్‌ మైనార్టీ సెల్‌ నేత జానీ వెస్లీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement