తరగతి గదులు లేకపోవడంతో నేలపైనే కూర్చుని చదువుకుంటున్నాం. ఎండకు, వానకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. 104 మంది విద్యార్థులకు రెండు వాష్ రూమ్‌లే ఉన్నాయి. ఏడాదిన్నరగా ఇదే పరిస్థితి. ఒకటో తరగతి నుంచీ ఇక్కడే చదువుతున్నాను.
– సీహెచ్ సత్యశ్రీ, 8వ తరగతి
వసతులు లేవు
పాఠశాలలో కనీస వసతులు లేవు. వాష్ రూమ్‌లకు రావడం లేదు. తాగునీటి సమస్య కూడా ఉంది. ప్రధానంగా గదులు లేక ఇబ్బంది పడుతున్నాం. 104 మంది విద్యార్థులను మూడు గదుల్లో ఉంచి ఉపాధ్యాయులు పాఠాలు చెపుతున్నారు.
– జి.దీప్తి శ్రీవేణి, 8వ తరగతి
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం
భవనాలు శిథిలావస్థకు చేరడంతో అధికారుల ఆదేశాల మేరకు పైకప్పులను తొలగించాం. కొత్త భవనాల నిర్మాణానికి ఏసీఆర్‌లో ప్రతిపాదనలు పంపించాం. సమస్య జిల్లా స్థాయి అధికారుల దృష్టిలో ఉంది. తాత్కాలికంగా గ్రామ సచివాలయ భవనంలోకి మార్చడానికి ఏర్పాట్లు చేయగా కొందరుగ్రామస్తులు అడ్డుకోవడంతో ఆగిపోయింది. వచ్చే విద్యాసంవత్సరానికి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం.
– శ్రీనివాసరావు, మండల విద్యాశాఖ అధికారి, గోపాలపురం


