ఆమె చేయి పడితే కంటి చూపు ఖాయం | - | Sakshi
Sakshi News home page

ఆమె చేయి పడితే కంటి చూపు ఖాయం

Mar 8 2026 7:47 AM | Updated on Mar 8 2026 7:47 AM

నిడదవోలు పట్టణంలో లయన్స్‌ కంటి ఆసుపత్రిలో పదమూడేళ్లుగా నేత్ర వైద్యురాలిగా పనిచేస్తున్న గొల్లపల్లి భరణి ఎల్లార్‌ తన కంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్నారు. ఆమె చేయి వేస్తే కంటి చూపు వస్తుందనే నమ్మకం వృద్ధుల్లో కలిగింది. ఇప్పటి వరకు ఆమె 38,596 కంటి శస్త్ర చికిత్సలు విజయవంతంగా పూర్తి చేశారు. సుమారు 2 లక్షల మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత కంటి వైద్య శిబిరాల్లో సైతం పాలు పంచుకుంటారు. రోగుల పట్ల ఎంతో ప్రేమగా మాట్లాడుతుంటారు. 1974లో కొవ్వూరులో జన్మించారు. 1999లో విశాఖపట్నంలోని ఆంధ్రా మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌, పీజీ పూర్తి చేశారు. వృత్తి పట్ల అంకిత భావం, పేదలకు ఉచిత వైద్య సేవలందించడంలో తనదైన ముద్ర వేశారు. గుర్తింపుగా విశ్వగురు వరల్డ్‌ రికార్డు నుంచి రోనా వారియర్స్‌ అవార్డును కూడా సొంతం చేసుకున్నారు.

కంటి వైద్యురాలు గొల్లపల్లి భరణి ఎల్లార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement