నిడదవోలు మండలంలోని శంఖారాపురం గ్రామ శివారున ఉన్న సహాయ స్వచ్ఛంధ సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మానసిక దివ్యాంగుల కేంద్రంలో విశాలాక్షి తన సేవాభావాన్ని చాటుకుంటున్నారు. అన్నెం పున్నెం ఎరుగని అభాగ్యులకు దగ్గర ఉండి పరిచర్యలు చేస్తూ సేవ అనే పదానికి సరైన నిర్వచనం చెబుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి గ్రామానికి చెందిన బలగం విశాలాక్షి పీజీ పూర్తి చేసి, మధ్యప్రదేశ్‌లోని బోజ్ యూనివర్శిటీలో బీఈ డీ(ఎంఆర్) పూర్తి చేశారు. ప్రస్తుతం మానసిక వికలాంగుల కేంద్రంలో ఆర్గనైజర్, ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న విశాలాక్షి సేవలకు గుర్తిస్తూ 2019లో మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా శిశుసం క్షేమ శాఖ ఆధ్వర్యంలో ఉత్తమ మహిళా సేవా పురస్కారం అందుకున్నారు. రాష్ట్ర, జిల్లా స్థాయిలో ఎన్నో ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు ఆమె సొంతం చేసుకున్నారు.


