వారం ముందే నుంచే తయారీ
సంక్రాంతి పండగ వచ్చిందంటే వారం రోజులు ముందు నుంచే పిండి వంటలు తయారు చేసేవాళ్లం. గతంలో ఐదు ఆరు రకాలు పిండి వంటకాలు రాత్రి సమయంలో వండేవాళ్లం. పగటి పూట వ్యవసాయ పనులకు వెళ్లి రాత్రి సమయంలో ఐదారుగురు మహిళలు కలసి ఒకేసారి ఒక ఇంట్లో వంటకాలు చేసుకునేవాళ్లం.
– గొర్రిపోటి పెదసూరమ్మ, పందలపాక
పిల్లల కోసం..
జంతికలు, చల్ల గుత్తులు, అరిసెలు, రవ్వలడ్డూలు, గొరిమిటీలతో కలసి ఈ ఏడాది ఐదు రకాల పిండి వంటకాలు తయారు జేశాం. ప్రతి ఏడాది ఇదే విధంగా తయారు చేసుకుంటున్నాం. పిల్లలు చదువు, వ్యాపారం నిమిత్తం దూరంగా ఉంటున్నారు. వారి కోసం సంక్రాంతికి పిండి వంటకాలు చేస్తుంటాం.
– సప్పా శాంతి, కొంకుదురు
వారం ముందే నుంచే తయారీ


