కొత్త బైక్ చోరీ
నల్లజర్ల: అనంతపల్లి ఎర్ర కాలువ బ్రిడ్జి సమీపంలో కొత్తగా ఏర్పడిన వైఎస్సార్ కాలనీ వద్ద గురువారం రాత్రి చోరీ జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే.. శ్రీకాకుళపు విజయ్ (పండు) ఇటుక బట్టీ నిర్వహిస్తున్నారు. గత ఏడాది నవంబర్‌లో అతను కొత్త పల్సర్ బైక్ కొనుకున్నారు. ఆ బైక్ చోరీకి గురైంది. తన ఇంటి ముందు కారు, ట్రాక్టర్‌తో పాటు మరో రెండు పాత బైక్‌లు, కొత్త బైక్ పెట్టారు. రాత్రి సమయంలో రెండు బైక్‌లపై తలకి మంకీ టోపీలు పెట్టుకుని నలుగురు వచ్చారు. ఇందులో ముగ్గురు రెండు బైక్‌లపై వెళ్లిపోయారు. విజయ్ ఇంటి వద్ద ఉన్న కొత్త బైక్ తాళం తీసి మరొకరు ఉడాయించాడు. ఈ చోరీ ఘటన అంతా ఇంటి ముందు ఉన్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఉదయం నిద్రలేచి చూసేసరికి వాకిట్లో కొత్త బైక్ కనిపించకుండా పోవడంతో బాధితుడు విజయ్ శుక్రవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు.


