రామరాజ్ షోరూమ్ ప్రారంభం
రాజమహేంద్రవరం సిటీ: ఫర్ ది రెస్టెక్టెడ్ ముద్రతో విక్రయిస్తున్న రామరాజ్ కాటన్ వస్త్రాలు, ఉత్పత్తులు సమాజంలో గౌరవం, ప్రతిష్ట, గుర్తింపును కలిగించేలా ఉన్నాయని రామరాజ్ కాటన్ ఫౌండర్, చైర్మన్ కేఆర్ నాగరాజన్ అన్నారు. శుక్రవారం రాజమహేంద్రవరం ప్రకాశంనగర్‌లో నూతన షోరూమ్‌ను జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్ వై.మేఘ స్వరూప్, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ చైర్మన్ చల్లా శంకరరావు, టీటీడీ బోర్డు సభ్యుడు అక్కిన ముని కోటేశ్వరరావు, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు తవ్వా రాజా, ఆదిత్య ఎంటర్‌ప్రైజెస్ అధినేత భోజంకి వెంకట ఉమామహేశ్వరరావు తదితరులతో కలసి ప్రారంభించారు. నాగరాజన్ మాట్లాడుతూ రామరాజ్ కాటన్ కంపెనీ దక్షిణ భారత దేశ మంతటా తెల్ల వస్త్రాల విక్రయాల్లో అగ్రస్థానంలో ఉందన్నారు. ఽనాణ్యతలో రాజీ లేదన్నది రామరాజ్ సంస్థ మంత్రంగా పనిచేస్తున్నామన్నారు.
వడ్డాణం వేలంపై
అభ్యంతరాలు తెలపండి
కాజులూరు: మండలంలోని ఆర్యావటం చెరువు తవ్వకంలో లభించిన బంగారు వడ్డాణం బహిరంగ వేలంపై అభ్యంతరాలు ఉంటే తెలపాలని తహసీల్దార్ రవీంద్రనాథ్ ఠాగూర్ తెలిపారు. శుక్రవారం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ 2008 జూన్ 8న ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనుల్లో భాగంగా ఆర్యావటం మంచినీటి చెరువు తవ్వుతుండగా సుమారు 119.560 గ్రాముల బరువు కలిగిన బంగారు వడ్డాణం లభ్యమైందన్నారు. ఈ విషయంపై అప్పటి గొల్లపాలెం పోలీసు అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి బహిరంగ వేలం నిర్వహించి, వేలం ద్వారా వచ్చిన సొమ్మును ప్రభుత్వ అకౌంట్‌లో జమ చేయాలని కాకినాడ జిల్లా కలెక్టర్ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. ఈ విషయమై క్లయిందారులు ఎవరైనా ఉంటే గొల్లపాలెం పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలన్నారు.


