మార్కెట్‌లోకి కియా ఆల్ న్యూ సెల్టాస్ కారు
రాజమహేంద్రవరం సిటీ: నగరంలోని కంటిపూడి కియా షోరూమ్‌లో శుక్రవారం కియా ఆల్ న్యూ సెల్టాస్ కార్‌ను ఆంధ్రప్రదేశ్ క్రెడయ్ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్ చేతుల మీదుగా మార్కెట్‌లోకి విడుదల చేశారు.
ఈ సందర్భంగా కంటిపూడి గ్రూప్ చైర్మన్ సర్వారాయుడు మాట్లాడుతూ సరికొత్త డిజైన్‌తో డిజిటల్ టైగర్ ఫేస్, ఆటోమేటిక్ స్ట్రీమ్‌లైన్ డోర్ హ్యాండిల్స్, ట్రినిటీ పానారోమిక్ డిస్ప్లే ప్యానెల్, ప్రీమియం బోస్ 8 స్పీకర్స్ ఆడియో, అడ్డాస్ లెవెల్– 2తో 21 అడ్వాన్స్‌డ్ ఆటోనమస్ ఫీచర్స్, 24 స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్స్ ఇలాంటి ఇంకెన్నో అత్యాధునిక ఫీచర్స్‌తో ఈ కారు అందుబాటులో ఉందన్నారు. మేనేజింగ్ డైరెక్టర్ సీహెచ్ సత్యనారాయణమూర్తి (చినబాబు), కె.వినయ్‌బాబు, ఎం.జగన్, కె.మన్మోహనన్‌రామ్, సీఈఓ సూర్య, కోమల పాల్గొన్నారు.


