క్రికెట్‌లో ఔటై బయటకు వస్తూ వ్యక్తి మృతి
దేవీపట్నం: క్రికెట్ ఆడుతూ ఔటయ్యి బయటకు వస్తూ ఓ వ్యక్తి కుప్పకూలి మృతి చెందాడు. మండలంలోని డి.రావిలంక గ్రామానికి చెందిన పందిరి రాజు (32) స్థానిక పునరావాస కాలనీలో నిర్వహిస్తున్న టోర్నమెంట్‌లో బ్యాటింగ్ చేసి ఔటయ్యి బయటకు రాగానే కుప్పకూలిపోయాడు. అతన్ని సహచరులు గోకవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి వివాహం జరిగిందని బంధువులు తెలిపారు.
యువతి అదృశ్యం ˘
సీతానగరం: మండలంలోని చినకొండేపూడికి చెందిన దోచూరి శైలజ కనిపించడం లేదని తల్లి దోచూరి పద్మ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్సై డి.రామ్‌కుమార్ శుక్రవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. హైదరాబాద్‌లో ఉంటున్న పద్మ, శైలజ గత నెల 25న చినకొండేపూడి వచ్చారు. గత నెల 31వ తేదీ రాత్రి నుంచి ఆ యువతి కనిపించకపోవడంతో హైదరాబాద్ వెళ్లిందని అనుకుని ఆరా తీయగా రాలేదని తెలిసింది. శైలజ ఫోన్ కూడా పని చేయకపోవడంతో తల్లి స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.


