రక్షణ గోడలు నిర్మించాలి
ఘాట్‌రోడ్‌లో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మలుపుల వద్ద వాహన ప్రమాదాల నివారణకు పటిష్టమైన రక్షణ గోడలు నిర్మించాలి. దీంతో పాటు చాలా ప్రాంతాల్లో రహదారి అధ్వానంగా తయారైంది. ఆయా ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలి. అప్పుడే ఇబ్బందులు ఉండవు.
– సవలం అమల, ఎంపీపీ, చింతూరు
భారీ వాహనాలు నిషేధించాలి
ఘాట్ రోడ్‌లో భారీ వాహనాల రాకపోకల కారణంగా తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. కంటైనర్లు, ఊక లారీలు తరచూ ఘాట్ రోడ్‌లో నిలిచిపోయి గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అవుతోంది. అధికారులు వీటిపై తగిన చర్యలు చేపట్టాలి.
– వేగి రాజా, వ్యాపారి,
మోతుగూడెం, చింతూరు మండలం
అవగాహన కల్పించాలి
ఘాట్ రోడ్‌లో డ్రైవింగ్‌పై వాహనదారులకు రవాణా అధికారులు అవగాహన కల్పిస్తే బాగుంటుంది. ఈ రోడ్‌లో పల్లానికి దిగే సమయంలో వాహనాలు సెకండ్ లేదా థర్డ్ గేరులో దిగాల్సి ఉండగా ఆయిల్ మిగులుతుందనే కక్కుర్తితో న్యూట్రల్ గేరులో దిగుతున్నారు. దీంతో మలుపుల వద్ద వాహనాలను అదుపు చేయలేక ప్రమాదాలకు గురవుతున్నారు.
– ఎం.శివరామకృష్ణ, మోతుగూడెం, చింతూరు మండలం
రక్షణ గోడలు నిర్మించాలి
రక్షణ గోడలు నిర్మించాలి


