21 కిలోల గంజాయి స్వాధీనం
ధవళేశ్వరం: గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరిని స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.10.80 లక్షల విలువైన 21 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ధవళేశ్వరం టిడ్కో ఇళ్లలో నివసిస్తున్న విడదవోలు సూర్యగాంధీ, రాజమహేంద్రవరం జెఎన్ రోడ్డులో నివసిస్తున్న గొలగాని బంగారు తిమ్మరాజు విశాఖ ఏజెన్సీ నుంచి తీసుకువచ్చిన 21 కిలోల గంజాయిని బుధవారం ఉదయం ధవళేశ్వరం చెరుకూరి లే అవుట్ వద్ద విక్రయానికి తెచ్చారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీఐ టి.గణేష్ సిబ్బందితో వెళ్లగా వారిని చూసి పారిపోయేందుకు యత్నించారు. పోలీసుల వారిని వెంబడించి అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విడదవోలు సూర్యగాంధీపై మండపేట పోలీస్‌స్టేషన్‌లో, గొలగాని బంగారు తిమ్మరాజుపై రాజమహేంద్రవరం త్రీటౌన్‌లో రౌడీ షీట్‌లు ఉన్నాయన్నారు. గంజాయి స్వాధీనం చేసుకున్న డిఎస్పీ భవ్య కిషోర్, సీఐ టి.గణేష్, ఎస్సై బి.హరిబాబు, హెడ్‌కానిస్టేబుల్ శ్రీను, కానిస్టేబుళ్లు లక్ష్మణ్, ప్రసాద్‌లను ఎస్పీ డి.నరసింహ కిశోర్ అభినందించారు.


