మేలు చేసే ఆలోచనలతో ముందుకు..
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): నూతన సంవత్సర వేడుకలు సంయమనం, సామాజిక బాధ్యత, మంచి విలువలతో కూడిన సంప్రదాయానికి ప్రతీకగా జిల్లా ప్రజలంతా జరుపుకోవాలని కలెక్టర్ కీర్తి బుధవారం ఒక ప్రకటనలో కోరారు. కుటుంబ సభ్యులతో ఇంటివద్దే నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ, సమాజానికి మేలు చేసే ఆలోచనలతో ముందుకు సాగాలని సూచించారు. జిల్లా ప్రజలందరికీ, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, రానున్న సంవత్సరం జిల్లాలో శాంతి, అభివృద్ధి, ప్రజల సంక్షేమం మరింత బలోపేతం కావాలని ఆకాంక్షించారు. నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే వారు పుష్పగుచ్ఛాలు, శాలువాలు తీసుకురావద్దని, వాటికి బదులుగా విద్యార్థులకు ఉపయోగపడే నోటు పుస్తకాలు, పెన్నులు, విజ్ఞానాన్ని పెంపొందించే పుస్తకాలు అందించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. విద్యను ప్రోత్సహించే ఈ ఆలోచన నూతన సంవత్సర ఆరంభానికి ఒక మంచి సంప్రదాయంగా నిలుస్తుందన్నారు.


