ఆకాంక్షలు సరికొత్తగా..
సాక్షి, రాజమహేంద్రవరం: గడిచిన ఏడాది ఎన్నో మధుర స్మృతులు మిగిల్చింది.. నూతన సంవత్సరంలోనూ మరింత ఆనందం నిండాలని కాంక్షిస్తూ యువత కొత్త ఏడాదికి ఆహ్వానం పలికింది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. మంగవారం అర్ధరాత్రి 12 గంటలకు యువకులు, ప్రజలు, అధికారులు ‘హ్యాపీ న్యూ ఇయర్’ అంటూ కేరింతలు కొట్టారు. కేక్‌లు కట్ చేశారు. కూల్‌డ్రింక్‌లు పొంగించి ఆనందంగా గడిపారు. డీజేలు పెట్టుకుని స్టెప్పులతో అదరగొట్టారు. ఒకరికొకరు నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పుకున్నారు. పూజలు, ప్రార్థనలతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.
2026కు స్వాగతం
నూతన సంవత్సరం 2026కు ప్రజలు, యువకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. ఎక్కడికక్కడ రోడ్లపైకి వచ్చి హాపీ న్యూఇయర్ అంటూ కేరింతలు కొట్టారు. యువత బీర్లు, కూల్ డ్రింక్‌లు పొంగించి మరీ ఉత్సాహంగా గడిపారు. ప్రముఖ హోటళ్లు, రెస్టారెంట్లలో డీజేల శబ్దాలతో ఆ ప్రాంతాలు మారుమోగాయి. చిన్నా పెద్ద అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్టెప్పులేశారు. నృత్యంలో మైమరచిపోయారు. రాత్రి 12 గంటలు దాటగానే ఒక్కసారిగా బాణసంచా పేల్చి నూతన సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పారు. ‘బైబై 2025’ వెల్‌కం ‘2026’ అంటూ కేరింతలు కొట్టారు. ప్రజల సందడితో నగరం మారుమోగింది. అపార్ట్‌మెంట్లలో అందరూ కలిసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
ప్రజల ఆశలు
నూతన సంవత్సరంపై పేద, మధ్యతరగతి ప్రజలు అనేక ఆశలు, ఆకాంక్షలు పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ‘సూపర్ సిక్స్’ పేరుతో హామీలు ఇచ్చారు. అధికారం చేపట్టి ఏడాదిన్నర దాటుతున్నా నేటికీ అతీగతీ లేదు. వాటి అమలుపై ప్రజలు ఎదురుచూస్తున్నారు.
యువతకు ఉపాధి దక్కేనా?
యువతకు 20 లక్షల ఉద్యోగాలు.. నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అందజేస్తామన్న కూటమి ప్రభుత్వ హామీ నేటికీ కార్యరూపం దాల్చలేదు. హామీ ఎప్పుడు అమలవుతుందా? అని నిరుద్యోగులు ఎదురుచూస్తున్నారు.
మహిళలకు చేయూత లేదు
తమ ప్రభుత్వ అధికారంలోకి వస్తే ప్రతి మహిళకూ ఆడబిడ్డ నిధి కింద ప్రతి నెలా రూ.1,500 ఆర్థిక సాయం ఇస్తామని ఎన్నికల వేళ చంద్రబాబు ప్రకటించారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా.. నేటికీ అమలు చేయలేదు. ఈ ఏడాదైనా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆ పాలన స్వర్ణయుగం
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలన స్వర్ణయుగమని ప్రజలు, మహిళలు, ఉద్యోగులు, వ్యాపారులు, యువత చెబుతోంది. గత ప్రభుత్వంలో గడప గడపకూ అందిన సంక్షేమం, వైద్య సేవలు, ఉద్యోగ అవకాశాలపై మననం చేసుకుంటున్నారు. చరిత్రలో ఏ సీఎం చేయనంతగా అన్ని రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలకు గత సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాంది పలికారని కొనియాడుతున్నారు. ఆయన పాలనను పదే పదే గుర్తు చేసుకుంటున్నారు.
నూతన సంవత్సరానికి
స్వాగతం పలికిన ప్రజలు
2026లోనైనా చంద్రబాబు ప్రభుత్వం
పథకాలు అమలు చేయాలని డిమాండ్
కూటమి ప్రభుత్వానికి మంచి
బుద్ధి ప్రసాదించాలంటున్న జనం
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనను
పదేపదే గుర్తు చేసుకుంటున్న వైనం
ఆకాంక్షలు సరికొత్తగా..
ఆకాంక్షలు సరికొత్తగా..


