మాధవరావు సేవలు ప్రశంసనీయం
రాజమహేంద్రవరం రూరల్: ప్రకృతి వ్యవసాయాన్ని ఉమ్మడి జిల్లాలో ప్రోత్సహించడానికి జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు విశేష కృషి చేశారని కలెక్టర్ కీర్తి చేకూరి అన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు 33 సంవత్సరాలు సర్వీసు అనంతరం మంగళవారం పదవీ విరమణ చేశారు. స్థానిక సూర్యా కల్యాణ మండపంలో నిర్వహించిన అభినందన సభలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ సాగును ప్రోత్సహించడంలో క్షేత్ర స్థాయిలో రైతులతో మమేకమై వాటివల్ల లాభాలను వివరించడంలో కీలకపాత్ర పోషించారన్నారు. జిల్లా సంయుక్త కలక్టరు మేఘ స్వరూప్, జిల్లా రెవెన్యూ అధికారి సీతారామమూర్తి, ఆర్డివో నాయక్, జేడీఏలు విజయకుమార్, జెడ్ వెంకటేశ్వరరావు, డాట్ శాస్త్రవేత్త నరసింహారావు, జిల్లా ఏపీ ఎన్జీజీవో సంఘ అధ్యక్ష కార్యదర్శులు మీసాల మాధవరావు, విజయకృష్ణ పాల్గొన్నారు.


