పరుగు పందెంలో బంగారు పతకం
బాలాజీచెరువు: ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన 100 మీటర్ల పరుగు పందెంలో కాకినాడ పీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల బీఏ ప్రథమ సంవత్సర విద్యార్థిని బి.నాగవిహారిక ప్రతిభ కనబరిచింది. ప్రో స్పోర్ట్స్ 100 ప్లస్ టీం, హైదరాబాద్ డిస్ట్రిక్ అథ్లెటిక్ అసోసియేషన్ నిర్వహించిన ఈ పోటీల్లో 12 సెకన్లలో పరుగు పూర్తి చేసి గోల్డ్ మెడల్‌తో పాటు రూ.30 వేల నగదు సాధించారు. అలాగే గత నెలలో నన్నయ వర్సిటీలో నిర్వహించిన అథ్లెటిక్స్ నన్నయవర్సిటీ చాంపియన్‌షిప్ పోటీల్లో పాస్టెస్ట్ ఉమెన్ టైటిల్ సాఽధించారు. కాకినాడ జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో బీఏ విద్యార్థి వి.రేష్మయాదవ్ ప్రతిభ చూపి బంగారు పతకంతో పాటు నొయిడాలో జనవరి 3 నుంచి నిర్వహించే జాతీయ పోటీలకు అర్హత పొందారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ కందుల ఆంజనేయులు, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ సంజీవ్‌కుమార్, పీడీ రమణ, డాక్టర్ పసుపులేటి హరిరామప్రసాద్ అభినందించారు.


