అన్నదాన ట్రస్ట్‌కు రూ.లక్ష సమర్పణ
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి ఆలయంలో అన్నదాన పథకానికి విశాఖపట్నానికి చెందిన దాత కవికొండల అప్పలనర్సమ్మ తన భర్త, దివంగత వెంకట్రావు పేరుపై శనివారం రూ.లక్ష విరాళంగా అందజేశారు.
జనసేన నాయకుడిపై అట్రాసిటీ కేసు
రాజోలు: ప్రజా సంఘాల నేతలపై దాడికి పాల్పడి కులం పేరుతో దూషించిన ఘటనలో జనసేన నాయకుడు పినిశెట్టి వెంకటస్వామి (బుజ్జి)పై రాజోలు పోలీసులు శనివారం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఈ నెల 25న శివకోటి ముసలమ్మ ఆలయ కల్యాణ మండపం మెట్లపై నుంచి జారిపడి రాజమహేంద్రవరానికి చెందిన బాలిక పాలపర్తి భవ్యశ్రీ మృతి చెందింది. ఈ ఘటనలో నిజ నిర్ధారణ కోసం రాజోలు ప్రభుత్వాస్పత్రి వద్దకు వచ్చిన జిల్లా మానవ హక్కుల వేదిక కార్యవర్గ సభ్యుడు జనుపల్లి సత్యానందం (నాని), రాజో లు నియోజకవర్గ బహుజన సమాజ్‌వాది పార్టీ ఇన్‌చార్జి ఆకుమర్తి భూషణంలపై పినిశెట్టి వెంకటస్వామి (బుజ్జి) దాడి పాల్పడినట్లు చెబుతున్నా రు. మృతురాలి కుటుంబానికి అండగా నిలిచిన తమను బుజ్జి కులం పేరుతో దూషించి, దాడి చేసినట్లు జనుపల్లి సత్యానందం, ఆకుమర్తి భూష ణంలు రాజోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బుజ్జిపై రాజోలు ఎస్సై రాజేష్‌కుమార్ ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు.


