కారుణ్యమూర్తీ.. నిత్యస్ఫూర్తి
ముళ్ల కొరడాల దెబ్బలు తన దేహాన్ని నిలువునా చీలుస్తూ.. సిలువపై రక్తాన్ని ఏరులై పారిస్తున్న అత్యంత బాధాకరమైన సందర్భంలో కూడా.. ‘తండ్రీ వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు’ అంటూ కరుణామయుడైన ఏసుక్రీస్తు అన్న మాటలు.. ఆయన అపూర్వ క్షమా గుణానికి నిదర్శనాలు. ప్రేమ, శాంతి, కరుణ వంటి సద్గుణాలను ప్రపంచానికి బో ధించిన ఆ కారుణ్యమూర్తి జనియించిన రోజయిన క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవులు గురువారం ఆనందోత్సాహాలతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. చర్చి ల్లో ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. క్రిస్మస్ గీతా లు ఆలపించి, కేక్‌లు కట్ చేశారు. దైవ కుమారుని వా క్కులు నిత్య స్ఫూర్తితో.. మదిమదిలో కొత్త కాంతులు నింపాలని ఆకాంక్షించారు. క్రీస్తు వెలుగును ప్రతిబింబించేలా కొవ్వొత్తులతో ఆరాధనలో పాల్గొన్నారు.
కారుణ్యమూర్తీ.. నిత్యస్ఫూర్తి


