
చించినాడ బ్రిడ్జిపై నేడు, రేపు రాకపోకల నిషేధం
కాకినాడ రూరల్: పోలీసులు ఆరోగ్యంగా ఉండేందుకు సైక్లింగ్‌తో పాటు యోగా, స్కిప్పింగ్, జుంబ డ్యాన్స్ వంటివి చేయాలని ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ ఎం.నాగేంద్రరావు అన్నారు. బెటాలియన్ సిబ్బందితో కలసి సండే ఆన్ సైక్లింగ్ కార్యక్రమం ఆదివారం ఉదయం చేపట్టారు. బెటాలియన్ నుంచి మొదలుకుని సర్పవరం జంక్షన్ వరకూ సైక్లింగ్ చేశారు. ఈ సందర్భంగా నాగేంద్రరావు మాట్లాడుతూ డీజీపీ ఆదేశాల మేరకు బెటాలియన్ సిబ్బందితో కలసి సైక్లింగ్ నిర్వహించామన్నారు. విధి నిర్వహణలో ఒత్తిడిని నివారించేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతి ఆదివారం సైక్లింగ్, యోగా కార్యక్రమాలు చేపడతామన్నారు. అడిషనల్ కమాండెంట్ దేవానందరావు, అసిస్టెంట్ కమాండెంట్లు చంద్రశేఖర్, మోహనరావు, ఆర్‌ఐలు అజయ్‌కుమార్, విఠలేశ్వరరావు, మురళీమోహన్, రాము, మరిబాబు, రాజు తదితరులు పాల్గొన్నారు.